80 మంది లబ్ధి దారులకు రూ.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
1 min read
మదనపల్లె ఎమ్మెల్యే షాజ హాన్ భాషా
మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె నియో జక వర్గం లోని పేద, మధ్య తరగతి కుటుంబాల కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక భరోసా కల్పి స్తున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపారు. మంగళ వారం మదనపల్లె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80 మంది లబ్ధిదారుల కు మొత్తం రూ.70 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మదనపల్లె పట్టణం, మదనపల్లె రూరల్, రామ సముద్రం, నిమ్మన పల్లి మండలాలకు చెందిన లబ్ధిదారు లకు ఆయా ప్రాంతాల నాయ కులు, ప్రజాప్రతి నిధుల సమక్షంలో చెక్కులను అంద జేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లా డుతూ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ, వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడు తున్న పేద, మధ్య తరగతి కుటుంబాల కు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మదనపల్లె నియోజకవర్గ పరిధి లోని దాదాపు 80 మంది లబ్ధిదారు లకు రూ.70 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.చెక్కులు అందు కున్న లబ్ధిదారులు మాట్లాడుతూ వైద్య ఖర్చుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తు న్నాయని సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఆర్థిక సహాయం అందించి న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు కృతజ్ఞత లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్య కర్తలు, ప్రజా ప్రతినిధులు, లబ్ధి దారులు పాల్గొ న్నారు.


