NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై 111 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ

1 min read

ఎన్నికల విధి విధానాలు, పోలింగ్ ప్రక్రియ పై పూర్తి అవగాహన

ఎన్నికల నిర్వహణలో మాస్టర్ ట్రైనర్ల పాత్ర కీలకం

మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి : అన్నమయ్య జిల్లాలో త్వరలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను పార దర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి పొర పాట్లకు తావు లేకుండా నిర్వ హించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళ వారం మదనపల్లె లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో 111 మంది మాస్టర్ ట్రైనర్లకు పంచా యతీ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వ హణ అధికారి లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు జిల్లా అధికారి అమర్నాథ్ రెడ్డి హాజరై మాస్టర్ ట్రైనర్లకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వ హణలో మాస్టర్ ట్రైనర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొ న్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారు లు, పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు, పోలింగ్ కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ విధానం, బ్యాలెట్ పత్రాల వినియోగం, ఓటర్ల గుర్తింపు, ఓటింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు  అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఎన్నికల సమయం లో ఎదురయ్యే వివిధ సందేహాలు, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేలా మాస్టర్ ట్రైనర్లు సిద్ధంగా ఉండాలని, తమకు అందించిన శిక్షణలోని అంశాల ను క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బందికి స్పష్టంగా వివరించా లని సూచించారు.ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. సమర్థ వంతమైన శిక్షణ ద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్య క్రమంలో సంబంధిత అధికారులు, శిక్షణ సిబ్బంది, 111 మంది మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *