NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధిని చూసి ఓటేయండి..         

1 min read

విస్తృతంగా పత్తికొండ ఏడవ ఎంపీటీసీ  అభ్యర్థి డి వెంకటలక్ష్మి ప్రచారం

న్యూస్ నేడు, పత్తికొండ: కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని పత్తికొండ పట్టణం ఏడవ ఎంపీటీసీ అభ్యర్థిని బోయ వెంకటలక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని ఏడవ ప్రాదేశిక నియోజకవర్గం లో స్థానిక స్థానిక టిడిపి నాయకులు రామనాయుడు, గోవిందు, ఆదినారాయణ, రామకృష్ణ, మధుల తో కలిసి అభ్యర్థిని బి వెంకటలక్ష్మి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తికొండ పట్టణంలోని వార్డులలో తాగునీరు సిసి రోడ్లు డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టి స్వచ్ఛ గ్రామ పంచాయతీకి దోహద పడిందన్నారు. ఈ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లయితే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *