NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 117, జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం, నైస్ యూత్ ఫర్ కన్సల్ ఎడ్యుకేషన్ సొసైటీ ల సంయుక్త ఆధ్వర్యంలో  నైస్ యువజన సాంస్కృతిక మరియు విద్యా సంస్థ, నైస్ కంప్యూటర్ విద్యా కేంద్రం లో అసోసియేషన్ ఆఫ్ ఆనలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లాయర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన ప్రపంచ శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి, సృజనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించనున్న విజ్ఞాన ప్రశ్నావళి పోటీలకు సంబంధించిన సూచన పుస్తకాన్ని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్  ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లైన్స్ జిల్లా చైర్ పర్సన్  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్  మాట్లాడుతూఅంతర్జాతీయ  అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్   జిల్లా 117  ఆధ్వర్యంలో ఈ నెల 20 వ తేదీన పాఠశాల స్థాయి సైన్స్ క్విజ్  పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో ఆరవ, ఏడవ, ఎనిమిదవ తరగతుల విద్యార్థులను జూనియర్ విభాగంగా, తొమ్మిదవ, పదవ తరగతులతో పాటు కళాశాల విద్యార్థులను సీనియర్ విభాగంగా పరిగణించనున్నట్లు వెల్లడించారు.శాస్త్ర విజ్ఞానం మానవ జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల విద్యార్థులు పాల్గొని విజ్ఞాన ప్రశ్నావళి పోటీల సూచన పుస్తకాన్ని పరిశీలించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తమ ప్రతిభను చాటుకోవాలని నిర్వాహకులు కోరారు. ప్రపంచ శాంతి, సుస్థిర అభివృద్ధి, శాస్త్రీయ ఆలోచనా విధానం అనే లక్ష్యాలతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించే దిశగా ఉపయోగపడుతుందని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *